శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నామని, కానీ గత పది సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే ఇప్పుడు 10…
కేటీఆర్ మల్కాజిగిరి ఎంపీ పదవి పై నిన్న సవాల్ విసరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం. నీకు నచ్చిన వ్యక్తి పేరు చెబితే రాజీనామా చేస్తారన్నారు. రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, భవిష్యత్తులో శిక్ష తప్పదని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కేటీఆర్ అలా మాట్లాడుతున్నట్లు ఉన్నారన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకు వస్తామని…
Ponnam Prabhakar: బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహాలక్ష్మి పథకం అమలు తరువాత కూడా ఆటో కొనుగోలు పెరిగాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆటో కార్మికులకు ఆర్ధిక సాయంపై సమీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల జనగణనపై బీహార్‌లో చేసిన విధానంపై అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఏజీతో కూడా మాట్లాడుతున్నాం సమస్యలు రాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా.. ? ఏవిధంగా చేయాలి అనేది త్వరలో…
మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణననీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు.. మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా TSRTC 100 బస్సులను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను మేడారంకు కూడా నడపనున్నుట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టాలని మేనిఫెస్టోలో…
హైదరాబాద్ ఎన్టీఆర్మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద TSRTC కొత్త బస్సులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 కొత్త బస్సులు ప్రారంభించటం సంతోషకరం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలు…
తెలంగాణ కెప్టెన్గా ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్! వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో గేల్ ఆడనున్నాడు. ఐవీపీఎల్ మొదటి ఎడిషన్లో తెలంగాణ టైగర్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని గేల్ స్వయంగా చెప్పాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు.…
Ponnam Prabhakar: ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు.. మైండ్ సెట్ మార్చుకోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికు రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.