కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మరో భధ్రాచలంగా భావించే ఇళ్ళందకుంటలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణ వేడుకలు జరుగుతాయన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి తమ పార్టీ నాయకులు, అధికారులు కలిసి వైభవంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. లోక కల్యాణం కోరకు అందరు బాగుండాలని అర్చకులు చదివిన మంత్రాలను అందరు ఆశీర్వచనాలుగా తీసుకోవాలి.. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఇల్లంతకుంటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయాన్ని పట్టించుకోలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పూర్వ వైభవం తీసుకోస్తాం.. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ సారి ఏ కార్యక్రమాలు చేపట్టలేక పోయాం.. ఇల్లంతకుంట రాములోరి కళ్యాణ వేడుకలను రాష్ట్ర స్థాయి వేడుకలుగా గుర్తిస్తామన్నారు. వచ్చే ఏడాది కని విని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసుకుందాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.