వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వెస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మ్యానిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నాయకులు పూనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇవాళ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజంతా సీఎం మ్యానిఫెస్టోపై చర్చిస్తారు. నూతన అంశాలు, కొత్త పథకాలపై కసరత్తు చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు ముఖ్య నేతలు జగన్ ను కలిశారు. నేటితో దాదాపు బీ ఫాంల అందజేత కూడా పూర్తవుతోంది. రేపు ఉదయం ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్రలో బస్సు యాత్రకు అనూహ్యంగా వస్తున్న స్పందన.. రేపు విజయనగరంలో సీఎం రోడ్ షో, బహిరంగ సభ గురించి చర్చించనున్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం, ప్రజల అసరాలు తీర్చడమే మా మా మ్యానిఫేస్టో అని పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన
సార్వత్రిక ఎన్నికల వేళ మమతాబెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌పై సోమవారం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2016లో చేపట్టిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాకే తగలింది.
పశ్చిమ బెంగాల్‌లో 2016 టీచర్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర… ట్రాఫిక్ ఆంక్షలు..
రేపు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా… ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ విడుదల చేశారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్ లో వెళ్లాలని సూచించారు. రేపు హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుందని, గౌలిగూడ రామ మందిరం నుండి మొదలై పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్.. బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్.. లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా ఈ హనుమాన్ శోభాయాత్ర సాగనుంది..
మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి డోన్ బహిరంగ సభలో కోట్ల, కె.యి.లపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నారు.. మీకు నిజంగా అభివృద్ధి అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. మీ దృష్టిలో కేఈ కోట్ల కలవడమే అభివృద్ధా అని మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి చూడాలంటే వారం రోజులు పడుతుందని చెప్పారు. 2014లో తాను రూ.50 లక్షలతో స్కూలు భవనాన్ని కట్టాలనుకుంటే ఇద్దరు కేకేలు అనుమతులు రాకుండా ఆపారని ఆరోపించారు. ఇక్కడ ప్రతి పనికి కప్పం వసూలు చేసిన జ్ఞాపకాలు డోన్ ప్రజలు మరువలేదని విమర్శించారు.
ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
పార్లమెంటు మొదటి ధశ ఎన్నికలు కాగానే మోడికి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీకి తప్పా సామాన్యుడికి న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లలలో బీఅర్ఎస్, బీజేపి ఏమి చేయలేదని ఆయన అన్నారు. బండిసంజయ్ పై అవినీతి, ఆరోపణలు వచ్చాయి కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని, తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండిసంజయ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండిసంజయ్ నిజమైన భక్తుడు అయితే గుడిలకి ఏమి చేసాడని, బీఅర్ఎస్ అభ్యర్థి ఆరుకొట్లు లతో ఓట్లని కొనాలని చూసాడు,హొటల్ లొ దొరికిన డబ్బులు బీఅర్ఎస్ వే అని ఆయన అన్నారు.
‘మేమంతా సిద్ధం’ రేపటి షెడ్యూల్ ఇదే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని.. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ తన కుమార్తె కోసం బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 5 సీట్లలో మామూలు అభ్యర్థులను నిలబెట్టారన్నారు. అందులో మల్కాజ్ గిరి సీట్ కూడా ఒకటన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిరిగిలో ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలని.. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన రాజేందర్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మళ్ళీ అదే రాజేందర్ ను ఎందుకు ఓటర్లు ఓడించారో అందరికీ తెలుసని విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో ఎందుకు దర్యాప్తు చేయించలేక పోయారని అడిగారు. కేటీఆర్ అవినీతిపై ఒక్కసారి కూడా రాజేందర్ ఎందుకు ప్రశ్నించలేదు? వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? అని ప్రశ్నించారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయి
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని ఆయన అన్నారు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారని, మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మి కి తులం బంగారం, నిరుద్యోగ భృతి పై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలని ఆయన కోరారు.
సైదాబాద్ ఏఎస్సైపై వేటు ఎందుకంటే..?
మజ్లీస్ కి కంచుకోటైన.. హైదరాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దశాబ్ధాలుగా అక్కడ అసదుద్ధీన్ ఒవైసీ పాగా వేసుకున్నారు. ఈసారి అతడిని ఖచ్చితంగా ఓడిస్తానికి ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత కంకణం కట్టుకున్నారు. కాని కొన్ని విషయాల్లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట ఆమెకు సీటు కేటాయించడంపై సొంత పార్టీ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే.. “ఒవైసీపై పోటీ చేసేందుకు మగాళ్లేవరూ దొరకలేదా” అని వ్యాఖ్యానించారు.