తెలంగాణలో కొత్త నినాదం తేవాలని, ఆపరేషన్ లోటస్ ఛోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. అందరి అభిప్రాయాలు చెప్పుకొనే వేసులు బాటు ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చరని, కానీ లక్ష్మణ రేఖ వుంటుందని తెలిపారు.
మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని, కాంగ్రెస్‌కు భారత్ జూడో యాత్ర సంజీవని అని ప్రజలు అంటున్నారని అన్నారు.