West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెరువులోకి ప్రవేశించిన 11 అడుగుల ఆడ మొసలిని చూసి ప్రజల్లో భయం నెలకొంది. మొసలిని చూసిన గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొసలిని రక్షించారు. కర్తాల్ నదికి 300 మీటర్ల దూరంలో ఉన్న సుందర్‌బన్‌లోని బసంతి ప్రాంతంలో మొసలి కనిపించింది. ప్రస్తుతం అటవీశాఖ బృందం గ్రామం నుంచి మొసలిని తీసుకెళ్లి నదిలో వదిలింది.
Read Also:Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?
చెరువులో ఈత కొడుతున్న ఆడ మొసలి గర్భం దాల్చింది. మొసలి రాత్రి సమయంలో గుడ్లు పెట్టింది, వాటి గుడ్లను అటవీ శాఖ బృందం చెరువు నుండి స్వాధీనం చేసుకుంది. బృందం మొత్తం 15 గుడ్లు కనుగొన్నారు. ఈ గుడ్లన్నీ ఇటీవలే పెట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గురువారం చెరువు ఒడ్డున పెద్ద ఆడ మొసలి సంచరించడాన్ని గ్రామ ప్రజలు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సుందర్‌బన్ టైగర్ ప్రాజెక్ట్ గోసాబా రేంజ్ కార్యాలయంలో ఈ సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో రేంజ్ అధికారి నవకుమార్ సావో నేతృత్వంలో అటవీశాఖ బృందం మొసలిని పట్టుకునేందుకు చెరువులో వల వేసి పట్టుకున్నారు. బయటకు తీయగా ఆడ మొసలి 11 అడుగుల పొడవు ఉన్నట్లు గుర్తించారు.
Read Also:CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం(వీడియో)
మొసలిని చూసేందుకు సమీపంలోని వారంతా గుమిగూడారు. మొసలిని పట్టుకోవడం చూసి వారిలో కొంత ప్రశాంతత ఏర్పడి హాయిగా తమ తమ ఇళ్ల వైపు వెళ్లిపోయారు. అనంతరం అటవీ శాఖ బృందం మొసలిని పడవలో తీసుకెళ్లి శారీరక పరీక్షల అనంతరం ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించి సుందర్‌బన్‌లోని హరిన్‌బంగా నదిలో వదిలారు. మొసలి ఊరు బయటకు వెళ్లిపోవడంతో ప్రజల భయం పోయింది.