Daggubati Venkatesh: దగ్గుబాటి వెంకటేష్ తన తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా ఎదిగారు. తన పేరుకు విజయాన్ని జోడించి విక్టరీ వెంకటేష్ అయ్యాడు. వెంకటేష్ కు కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. వెంకటేష్‌కు సినీ పరిశ్రమలో సౌమ్యమైన వ్యక్తిగా పేరుంది. ఎలాంటి వివాదాలు లేకుండా కెరీర్‌లో ఎదిగాడు. ఆయన ఎప్పుడూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేయలేదు. అయితే ఈసారి ప్రచారానికి సిద్ధమయ్యారు. తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకీ మామ ప్రచార బరిలోకి దిగనున్నారు.
Read also: Lok Sabha Elections 2024: గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారిన రాయ్ బరేలీ పరిస్థితేంటి..?
ఇవాళ విక్టరీ వెంకటేష్ ఖమ్మంలో వియ్యంకుడు రఘురాంరెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేష్ కూతురు, రఘురామ్ రెడ్డి కోడలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. మామను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రీతను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చారు. ఇక చిన్న కుమారుడికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డను ఇచ్చారు. దీంతో వెంకటేష్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వియ్యంకుడి విజయం కోసం శ్రమిస్తున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Kishan Reddy: నేను ధైర్యంగా చెప్తున్నా.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి..