వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు.. రాజకీయ కుట్రలలో భాగంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని తప్పుడు పద్దతిలో ఇరికించారన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్య..లిక్కర్ స్కాం కేవలం మీడియాను, ప్రజలను నిజమైన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు..
చంద్రబాబును మించిన క్రిమినల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు…