వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు.. రాజకీయ కుట్రలలో భాగంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని తప్పుడు పద్దతిలో ఇరికించారన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్య..లిక్కర్ స్కాం కేవలం మీడియాను, ప్రజలను నిజమైన సమస్యల నుండి దృష్టి మరల్చడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు.. కేసు మొత్తం ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్-డిగ్రీ, హింస, లంచాలు మరియు ప్రలోభాల తోనే కేసును ముందుకు నడుపుతున్నారు.. 2014 – 19 కాలంలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉన్నాడనేది వాస్తవమని జగన్ అన్నారు.. ఆయన దిగజారిపోయాడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. 2014-19 కాలంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును కొట్టివేయాలని.. 2024-29కి తన విధానాన్ని సమర్థించుకోవాలని ఆయన వైసీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని తప్పుబడుతున్నారన్నారు. ఓవైపు వైసీపీ నాయకులపై మద్యం కుంభకోణం ఆరోపణలు చేస్తూనే.. కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అవినీతి మద్యం పద్ధతులను తిరిగి పునరుద్ధరిస్తోందని తెలిపారు.
READ MORE: LAC: 13 వేల అడుగుల ఎత్తులో, చైనాకు చేరువలో.. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ప్రారంభానికి సిద్ధం..
“బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో అక్రమ మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేసి మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించింది.. ప్రస్తుత ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు, ఎంఆర్పీ కంటే ఎక్కువ బ్యాక్ డోర్ మద్యం అమ్మకాల చేయిస్తుంది.. అవినీతి, మాఫియా వైన్ షాపుల లైసెన్స్‌లను ఇచ్చారు.. తద్వారా డిస్టిలరీలకు ఆర్డర్‌లను పెంచి, 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తుంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తనపై.. తమ పార్టీ నేతలపై తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపివేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని అరెస్టులు చేయిస్తున్నారు.. దర్యాప్తు ముసుగులో వైసీపీ నేతలను అరెస్టు చేయడానికి, చట్టపరమైన ప్రక్రియను ఆలస్యం చేసి ఎక్కువ రోజులు జైలులో ఉంచడానికి సిట్‌ను ఉపయోగిస్తున్నారు.. ఇదే టీడీపీ అసలు ఎజెండా.. అసలు విచారణ ప్రారంభమైతే నిజం బయటపడుతుంది.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైసీపీ నేతలను అరెస్టు చేయించే లక్ష్యంతో జరుగుతున్న రాజకీయ వేట.. వైసీపీని అణచివేయడానికి ఇటువంటి కుట్రలు జరిగిన ప్రతిసారీ మేము ధైర్యంగా ఎదురుతిరిగాము. ప్రజల గొంతుకగా నిలబడి అన్యాయాలను ధీటుగా ఎదుర్ని వైసీపీ తన స్థానాన్ని సుస్దిరం చేసుకుంది..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వైసిపి ప్రజల కోసం నిలబడుతుంది.. వారికి అండగా పోరాడుతుంది..” అని మాజీ సీఎం జగన్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.