1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
2.తెలంగాణలో వివిధ సమస్యలపై ట్వీట్లు చేస్తుంటారు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇటీవల ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై తనదైన రీతిలో స్పందించారు రేవంత్. రాహుల్ గాంధీని విమర్శిస్తూ టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణలో ఆరోగ్యరంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను ప్రస్తావించారు.
3.ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖాతాలో మరో పెద్ద సంస్థ చేరింది. ప్రాసెస్ మైనింగ్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన విషయం మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. కాగా మినిట్ సంస్థ బిజినెస్ వ్యవహారాల్లో ఆపరేషన్స్ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి చెందింది.
4.2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ చేశారని నారా లోకేష్ విమర్శించారు.
5.టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.
6.డ్రగ్స్ కి బానిసలవుతున్న విద్యార్ధుల్ని ఆ మురికికూపం నుంచి బయటపడేసేందుకు పోలీసులు కఠినచర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి మరణంలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నల్లకుంట పోలీస్ ల అదుపులో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులు వున్నారని తెలుస్తోంది.
7.గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటివరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బ్రావో 171 వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో ఉన్న మలింగ 170 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో వీరి తర్వాత అమిత్ మిశ్రా (166), పీయుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఉన్నారు.
8.భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్‌లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి పలు సెట్లను రూపొందించారు.
9.బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్చ్ షీట్ దాఖలు అయ్యింది. అతడు, అతని అసిస్టెంట్స్ కలిసి ఒక మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ ఆచార్య వద్ద పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్.. అతను తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే.. 2010లో అతడు తనతో శృంగారం చేయాలని బలవంతపెట్టాడని, పోర్న్ వీడియోలు చూపించి,
10.డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడు.