Padi Kaushik Reddy : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని, ప్రశ్నిస్తున్న ప్రజా…
Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆందోళనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా, ఘట్కేసర్ వద్ద పోలీసులు జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ…
దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.