భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు.. పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు. అందుకే.. ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా.. తాను సింగిల్‌గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్‌గానే పోటీ…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై…