శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజాను అరెస్ట్ చేసి.. అతని వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. Also…
ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజా ను అరెస్ట్ చేసి... రాజా వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంది.. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు…
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. అతడికి పెరోల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్, కిలాడీ లేడీ నిండిగుంట అరుణపై కేసులు నమోదు చేశారు..
తనను తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. హైకోర్టు తీర్పు వల్లే 14 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను.. కానీ, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు..
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్ను పోలీసులు అరెస్టుచే శారు. పోలీసుల కథనం.. పదేళ్ల క్రితం మిను మునీర్.. సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న…