ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలయ్యారు. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంత జరిగినా ప్రమాదానికి కారకులైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా సిల్లీ రీజన్స్‌తో కేసు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకూ నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది.
భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు. Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న…
కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామం.. గంగాధర్ సూరిబాబు శ్రీను సమీప బంధువులు.. సూరిబాబు శ్రీను దగ్గర గంగాధర్ అప్పు తీసుకున్నాడు.. ఏమి ఇబ్బందులు వచ్చాయో ఏమోగానీ ఈ మధ్యకాలంలో గంగాధర్ ఆర్థికంగా చితికిపోయాడు.. ఇల్లు కూడా కట్టాడు.. సూరిబాబు గంగాధర్ కలిసి కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు.. బంధువులైనప్పటికీ చేసిన అడగడం మామూలే.. అదే రీతిన సూరిబాబు, శ్రీనులు గంగాధర్ ను తీసుకున్న అప్పు చెల్లించాలని ఈ మధ్య తరచూ అడగడం మొదలుపెట్టారు.. వడ్డీ కూడా కట్టకపోవడంతో మరింత…
బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు.
అసాంఘిక కార్యాకలాపాలకు శ్మశాన వాటికను అడ్డాగా మార్చుకుంది ఓ మహిళ. శ్మశానంలోని గదిలో వ్యభిచార దందా నడుపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తోంది. శ్మశానంలో అయితే ఎవరికీ అనుమానం కలుగదని భావించింది. కానీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే కదా.. ఈ క్రమంలో విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనఖీలు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చింది ఓ మహిళ.…