Meerpet Murder Case: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు చెబుతుంటే.. పోలీసులే షాక్ అవుతున్నారు. గురుమూర్తి పోలీసుల ముందు చెప్పిన విషయాలు.. 14వ తేదీన భార్య, పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాం.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాం.. భార్య నాతో గొడవ పెట్టుకుంది.. తాళి తీసి మొహంపై విసిరింది.. వెంటనే గోడకు అదిమి కొట్టాను.. స్పృహ తప్పి పడింది అనుకున్నా.. కానీ చనిపోయిందని పేర్కొన్నారు. శవం మాయం చేయాలని ప్లాన్ చేశా.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాను.. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకిట్ లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేశా.. 6 గంటల పాటు ఉడికించా.. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశా.. అనంతరం బోన్స్ ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చిన.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకిట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేసా అని గురుమూర్తి వెల్లడించారు.
Read Also: America : దూకుడు చూపిస్తున్న ట్రంప్.. అప్పుడే మెక్సికో సరిహద్దుకు 1500 మంది సైనికులు
ఇక, పినాయిల్ తో ఇంట్లో రక్తం క్లీన్ చేశాను అని గురుమూర్తి తెలిపాడు. అతడు చెప్పిన వాటిలో ఒక్కధానికి కూడా పోలీసులు ఆధారాలు దొరకకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లతో పాటు అన్ని వస్తువులను ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీ చేయిస్తున్నారు. హత్య కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో.. పోలీసులు అయోమయానికి గురి అవుతున్నారు. చెరువులో కూడా గాలించిన ఒక్క ఆధారం లభించలేదని పోలీసులు వెల్లడించారు. తన భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే.. నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను అతడు ప్రశ్నిస్తున్నాడు. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులనే గురుమూర్తి బెదిరిస్తున్నాడు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.