Fire Accident: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేషనల్ హైవే పక్కన క్లాసిక్ దాబా వద్ద ఉన్న పోలిక్యాబ్ శానిటేషన్ ఎలక్ట్రికల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రమాదానికి షాపులో షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారుగా కోటికి పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని షాప్ యజమాని వెల్లడించారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు..ఇప్పటికే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.