ఒక రాష్ట్ర సీఎం భద్రత చాలా పకడ్బందీగా వుంటుంది. వుండాలి కూడా. కానీ స్వయాన ఒక ముఖ్యమంత్రిపై అగంతకుడు దాడిచేయడం కలకలం రేపుతోంది. సీఎం నితీష్ కుమార్ యాదవ్ కు చేదు అనుభం ఎదురైంది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతను దాటుకుంటూ వెళ్లి దాడి చేయడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడిని సీఎం భద్రతా సిబ్బంది పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. భక్తియార్‌పూర్ మార్కెట్‌కు సమీపంలో భద్రతా సిబ్బందిని కూడా యువకులు తోసేశారు. ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడని అంటున్నారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత పాట్నాకు తిరిగి వచ్చారు. అనంతరం నితీష్ కుమార్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తియార్‌పూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయబోతున్నారు. అప్పుడు గుంపులో ఉన్న ఓ యువకుడు సీఎంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ దాడిలో సీఎంకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.