Tamil Nadu: తండ్రీ కొడుకుల మధ్య గోడవలు అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐపై వారే ఎదురు తిరిగారు. తమ మధ్య ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు.
Blast : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి మావోయిస్టుల ఉనికిని గుర్తుచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, భద్రతా దళాలు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో మావోయిస్టుల తాకిడి ఎదురవ్వగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.…
11 Cops Killed In Blast By Maoists In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో అరాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో మొత్తం 11 మంది పోలీసులు చనిపోయినట్లు సమాచారం.