అనుమానం పెనుభూతంగా మారింది. ఒక చిన్న అనుమానం ఒక వ్యక్తి ప్రాణం తీసేవరకు వచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుణకు సమీపంలోని లాడ్‌పుర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వారింటికి కొంతమంది వ్యక్తలు వచ్చి అతడిని బయటికి లాకొచ్చారు. తమ వద్ద కాజేసిన ఫోన్ ఇవ్వాల్సిందిగా అరుస్తూ అతడిని చితకబాదారు. తనకేమి తెలియదని అరవింద్ చెప్తున్నా వినకుండా అతడి బట్టలను విప్పి, అతని చేతులు వెనక్కి కట్టేసి చితక్కొట్టారు. వాతలు పెట్టారు.
అడ్డొచ్చిన భార్యాపిల్లలను కూడా దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టారు.ఇదంతా వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని హాస్పిటల్ కి తరలించారు. అయితే వారు ఫోన్ కోసం మాత్రమే దాడి చేసినట్లు కనిపించలేదని, ఈ దాడి వెనుక వేరే కారణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు