రాజకీయాలు అన్నాకా వివాదాలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని ఆమె నా మీద ఘాటు ఆరోపణలు చేస్తుందని తెలుపుతున్నారు. ఆ మహిళతో తనకు 2009లో ఆమె పరిచయమైందని.. 2013లో ఒకసారి తనను కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరిందని, ఆ తర్వాత తన కొడుకు చదువుకు హెల్ప్ చేయమని అడిగిందని, తాను చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు.
ఇంతకంటే ఆమెతో తనకు వేరే సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాటలో నిజం లేదని పలువురు అనుమానిస్తున్నారు. కాగా, ఆమె ఇలా బెదిరించడం ఇది మొదటిసారి కాదని, గతంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదంటే డబ్బులలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇప్పుడు తన బిడ్డకు నేను తండ్రిని అంటూ నిందలు వేస్తుందని, ఇదంతా తన రాజకీయ వ్యతిరేకులతో కలిసిన సదరు మహిళ చేతులు కలిపి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇందులో నిజమెంతో పోలీసులు విచారణ చేస్తే తప్ప తెలియదంటున్నారు బీజేపీ నేతలు.