వర్షాలు కురిసి గోదావరికి పెద్దమొత్తంలో నీరు చేరితే దిగువున ఉన్న కోనసీమ వరదతో అనేక ఇబ్బందులు పడుతుండేది. వేలాది ఎకరాల పంట వరదనీటికి కొట్టుకుపోయేది. ప్రస్తుతం దిగువ గోదావరిపై పోలవరం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, పోలవరం వద్ద ప్రస్తుతం కాఫర్ డ్యామ్ ను ఏర్పాటు చేయడంతో వరద ఉధృతి కొంతమేర తగ్గింది. గతంలో రాజమంత్రి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తేది. కాని, ఇప్పుడు ఆ పరిస్థితులు…
కేంద్ర జలశక్తిశాఖ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఈ అంచనాలను అంగీకరిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలను రేపు ఆర్ధిక శాఖలకు పంపించనున్నారు. పోలవరం సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలు పై వచ్చేవారం కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టును ఈ…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్‌కు వెళ్లారు.. స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్ జగన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్‌ని…
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర నీటిమట్టం 27 మీటర్లకు చేరింది. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు చేరింది. వరద నీరు పెరుగుతుండటంతో ఆలయంలోకి భక్తులను నిరాకరించారు. దేవీపట్నం మండలంలోని…