నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
MLC Venkateswara Rao: శాసన మండలిలో చర్చ కంటే రచ్చ ఎక్కువగా నడిచిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారని.. పోలవరంపై వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పీడీఎఫ్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అసలు పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత.. నిర్వాసితులకు ఇచ్చే పరిహారం ఎంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 75శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వం…
Polavaram Project: ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు నెలకొందని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను స్వీకరించి విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి పోలవరం నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పర్యావరణ అనుమతులకు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై…
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం…
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే…