Pakistan: పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన 27 ఏళ్ల అర్షద్ నదీమ్ జావలిన్ త్రోలో స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నీరజ్ చోప్రా రజతంలో సరిపెట్టుకున్నాడు. నదీమ్ స్వర్ణం సాధించడం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నదీమ్ రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల త్రో సాయంతో స్వర్ణం సాధించారు
పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 5 లక్షల మందికి పైగా సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ముందుగా రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వ్యాపారులు షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు.
Turkey insults Pakistan: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ ను ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. పతనానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు తలొగ్గితేనే పాకిస్తాన్ కు అప్పు పుడుతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నాయకులు మాత్రం కొన్ని సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెదిరింపుల వ్యవహారం చర్చగా మారింది.. తమ నేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి భద్రతల కల్పించాలని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని షరీఫ్ ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణ, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు..…
పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది నేషనల్ అసెంబ్లీ.. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. పాకిస్థాన్‌కు చైనా, సౌదీ, టర్కీ స్నేహితులని చెప్పుకొచ్చారు. చైనా సహకారంతో ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తామన్నారాయన. అయితే, భారత్, అమెరికాలతో సత్సంబంధాలు ముఖ్యమే అన్నారు షరీఫ్. తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా… కశ్మీర్‌కు శాంతియుత పరిష్కారంతోనే అది సాధ్యమన్నారాయన. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామన్నారు పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక, కశ్మీర్‌లో…