బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వం సరికొత్త బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుతో అక్రమ వలసలకు అట్టుకట్ట వేసినట్టైంది. వివాదాస్పద రువాండా బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.
UK: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా దేశాల నుంచి రాడికల్ ఇస్లామిక్ట్ దృక్పథం కలిగిన మత విద్వేష బోధకులు రాకుండా యూకే బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని యూకే మీడియా ఆదివారం నివేదించింది. బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో అక్కడి రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులను గుర్తించడానికి అధికారులను నియమించారు. తద్వారా వారికి…
Laughing Gas: నైట్రస్ ఆక్సైడ్ సాధారణంగా "లాఫింగ్ గ్యాస్"గా పిలుస్తుంటారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వినోద కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న దీన్ని బుధవారం నుంచి నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ్రగ్‌ని ఉత్పత్తి చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగు స్థానానికి వెళ్లాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ వివాదంపై స్పందించాయి. అమెరికా విచారణకు ఇండియా సహకరించాలని కోరింది.
G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు
రాజకీయాల్లో ఉన్న వారు కుటుంబానికి సమయం కేటాయించాలంటే కష్టమే. రాజకీయాల్లో ఉంటూ.. అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఉండే వారు అయితే మరీ కష్టం.
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో కొన్ని వివాదాల్లో ఆయన ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సారి ‘పెన్ను’ వివాదంలో రిషి సునాక్ చిక్కుకున్నారు. ఇప్పటికే అక్కడి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టలేక రిషి సునాక్ విమర్శల పాలవుతున్నారు. ఆయన ఉపయోగిస్తున్న పెన్ను ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఎరేజబుల్ ఇంక్‌తో ఉన్న పెన్నును రిషి సునాక్ వాడటం ప్రస్తుత వివాదానికి కారణమైంది.
Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు.
King Charles Grand Coronation Ceremony: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు.…
Workers Strike : పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికులు బ్రిటన్ లో రోడ్డుపైకి వచ్చారు.