ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు హస్తిన వెళ్లనున్నారు.. ఇవాళ ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించనున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని…
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని…
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది..…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
కేంద్రం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందే.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు సంయుక్త కిసాన్ మెర్చా నేత రాకేష్ టికాయత్.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన ఏడాది దాటింది.. ఇక, ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.. అయితే, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి..…
దేశంలోని కోట్లాది మంది రైతులకు నవంబర్ 19 వ తేదీ ఉదయం దేశానికి మీ సందేశాన్ని వినిపించారు. మొత్తం 11 సార్లు చర్చలు జరిపిన తర్వాత ద్వైపాక్షిక పరిష్కారం కాకుండా ఏకపక్ష ప్రకటన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, మీరు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా మీ ప్రభుత్వం ఈ హామీని నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం,” అని లేఖలో పేర్కొన్నారు “ఎస్కెఎం”. రైతు ఉద్యమం లక్ష్యం, డిమాండ్ “కేవలం మూడు…
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…