భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాధరణ మళ్లీ పెరిగింది.. గత ఏడాదితో పోలిస్తే ఆయన పనితీరు మెరుగుపడినట్టు ప్రజలు అభిప్రాయపడ్డారు.. ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై విశ్వాసాన్ని పెంచుకున్నారు.. ఇక, మరోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీయే కావాలని కోరుకుంటున్నట్టు ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు.. ప్రపంచంలోనే నంబర్ వన్ స్పాట్‌కు చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్రమోడీ..
Read Also: జనవరి 22, శనివారం దినఫలాలు
ప్రపంచంలోని దేశాధినేతల్లో నరేంద్ర మోదీకే పాపులారిటీ ఎక్కువగా ఉందని తేలింది.. ‘ద మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్’ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా విడుదల కాగా.. నరేంద్ర మోడీకి 71 శాతం రేటింగ్ లభించినట్లు పేర్కొంది.. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ 66 శాతంతో రెండో స్థానం ఉంటే.. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ 60 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడె 43 శాతం రేటింగ్‌తో ఆరో స్థానాన్ని దక్కించుకున్నట్టు స్పష్టం చేసింది ‘ద మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్’.. ఇలా ఇంటా.. బయట.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ మళ్లీ పెరగడం విశేషం.. కాగా, కరోనా సమయంలో ఆయన రేటింగ్ పడిపోయింది.. దేశంలోనూ ప్రజాధరణ తగ్గిన విషయం తెలిసిందే.