ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు…
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని…
పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. కళ్యాణ్‌సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన ఆయన.. నేరుగా కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహం దగ్గర పూలను ఉంచి నమస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్ సింగ్…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత…
నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పారదర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా నగదును…
పార్లమెంట్ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉభయసభలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో రేపు సమావేశం కానున్నారు. లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై…
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే…
సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.. దానిలో భాగంగానే మోడీ-పవార్ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.. ఇక, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా…
కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.. నరేంద్ర మోడీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ అమిత్‌షా – హోంశాఖ, సహకారశాఖ నితిన్ గడ్కరీ – కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ…