BJP: సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా సాలుదొర – సెలవుదొర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ ప్రచారాల్ని మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేసుకుంటున్నారు. వినూత్నమైన ప్రచారాలకూ శ్రీకారం చుడుతున్నారు. బీజేపీ పార్టీ అయితే మరీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యం చేసుకొని.. విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ఇప్పుడు సాలుదొర – సెలవు దొర ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. కేసీఆర్‌కి వ్యతిరేకంగా పాటలు కూడా సిద్ధం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ.. ఈ క్రమంలోనే ఓ పాటని రిలీజ్ చేశారు.
1. ఇంటికో ఉద్యోగమంటివి,
ఇయ్యకుండ గోసపెడ్తివి.
సాలు దొర- సెలవు దొర.
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
- Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
2. ఏడబోయింది నిరుద్యోగ భృతి?
ఎంతకు దిగజార్చినవ్ మా నిరుద్యోగుల గతి!?
సాలు దొర- సెలవు దొర.
3. ఉచితంగా ఎరువులు ఇస్తనంటివి,
ఉత్త మాటలు చెప్పి, రైతులను ఉదరగొడ్తవి!
సాలు దొర- సెలవు దొర.
4. దళితుడినే ముఖ్యమంత్రి చేస్తనని,
దగా చేసి గద్దెనెక్కితివి,
అట్నించి నియంతవై మా నెత్తికెక్కితివి!
సాలు దొర- సెలవు దొర.
5. వరి వేస్తే ఉరి అంటివి,
అరిగోసలుపెట్టి రైతులను లాస్ చేస్తివి.
సాలు దొర- సెలవు దొర.
6. అత్యాచారాలకు అడ్డు లేదు,
సత్వర చర్యలకు దిక్కు లేదు.
శాంతి భద్రతలను గాలికొదిలేసిన మీ ఏలుబడి
సాలు దొర- సెలవు దొర.
7. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తనని,
అక్షరాల రైతులను మోసం చేస్తిరి.
సాలు దొర- సెలవు దొర.
8. అమరవీరుల త్యాగాలు గుర్తుకున్నయా?
అసెంబ్లీల ఒక్కసారైనా వాళ్లను యాజ్జేసుకున్నరా?
సాలు దొర- సెలవు దొర.
9. పేరుకే ఇరవై నాలుగు గంటల కరెంటు,
ఎవుసం ఎండుతున్నది. రైతు గుండె మండుతున్నది.
సాలు దొర- సెలవు దొర.
10. ప్రగతి భవన్ నుండి ఫామౌజుకు, నిత్యం ప్రయాణాలు,
వృథా చేస్తున్నవ్ ప్రజాధనం, కోట్ల రూపాయలు.
సాలు దొర- సెలవు దొర.
11. పల్లెల్ని బెల్ట్ షాపులకు, పట్నాల్ని పబ్బులకు రాసిచ్చి,
తెలంగాణ ప్రజల తలరాతల్ని తాకట్టు పెడితిరి.
సాలు దొర- సెలవు దొర.
12. సచివాలయంలో అడుగుపెట్టరు,
సస్తున్నం మొర్రో అని మొత్తుకున్నా ప్రజలను పట్టించుకోరు.
సాలు దొర- సెలవు దొర.
13. సర్ ప్లస్ బడ్జెట్ తో చేతిల పెట్టిన రాష్ట్రాన్ని,
అప్పుల కుప్ప చేసి, తిప్పలు పెడుతుంటిరి.
సాలు దొర- సెలవు దొర.
14. పోడు భూములపై పూటకో మాట,
గోడు పట్టించుకోకుండా ఆదీవాసులతో ఆటా?
సాలు దొర- సెలవు దొర.
15. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు దాటినా,
పాలమూరు వలసలు తగ్గలే.
కృష్ణ-గోదారి నీళ్లతో, తెలంగాణ బీళ్లు తడవలే.
ఇగ, సాలు దొర- సెలవు దొర.
16. కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు.
ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తలేవు.
విశ్వవిద్యాలయాల వరకు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినవ్.
ఇగ, సాలు దొర- సెలవు దొర.
17. కొట్లాడిరది నీళ్లు, నిధులు, నియామకాల కోసం,
మిగిలింది కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలు.
ఇగ, సాలు దొర- సెలవు దొర.
18. ఉద్యమకారులను తరిమికొట్టినవ్,
ఉద్యమ ద్రోహులను భుజాన మోస్తున్నవ్.
ఇగ, సాలు దొర- సెలవు దొర.
19. మీ కుటుంబానికే పదవులు,
మీ కుటుంబానికే కొలువులు.
ఓ నయా నిజాం, నియంతృత్వమే నీ నైజం.
సాలు దొర- సెలవు దొర.
20. డబ్బా ఇండ్లూ కాదు, డబులు బెడ్రూం కట్టిస్తనంటివి.
ఉబ్బిచ్చే మాటలు చెప్తూ, పబ్బం గడుపుతుంటివి.
సాలు దొర- సెలవు దొర.
21. జర్నలిస్టులకు ఇండ్ల జాగ ఇస్తనంటివి,
కాంట్రాక్టు ఉద్యోగాలే లేకుండా చేస్తనంటివి.
నీ గారడీ మాటలకో దండం, నీ గడీల పాలనకో దండం.
సాలు దొర- సెలవు దొర.
22. దళితలకు మూడెకరాల భూమి
దగ చేసిన నీ బూటకపు హామీ.
జూఠా మాటల కేసీఆర్,
ఇగ… నీ ఆటలు సాగవ్ ఖబర్థార్.
సాలు దొర- సెలవు దొర.
23. బీసీల సంక్షేమంతో పాటు రిజర్వేషన్లనూ మింగేస్తివి.
బాసులం మేమేనని అధికారం చెలాయిస్తుంటిరి.
సాలు దొర- సెలవు దొర.
24. రాజ్యాంగాన్ని అవమానిస్తివి.
ప్రజాస్వామ్యానికి తూట్లూ పొడిచి,
నియంతృత్వ కుటుంబ పాలనకు ఊపిరి పోస్తివి.
సాలు దొర- సెలవు దొర.
25. ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కిస్తివి,
ఆర్టీసీ చార్జీలు పెంచి, పేదల నడ్డి విరిస్తివి.
సాలు దొర- సెలవు దొర.
26. మంచిగున్న సచివాలయం కూలగొడ్తివి.
ముప్పు పొంచి ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోపోతివి.
సాలు దొర- సెలవు దొర.
27. ఏడంచెల గడీలతో నీ ఫామౌజ్ కట్టుకుంటివి.
అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపాన్ని మాత్రం యాదిమరిస్తివి.
సాలు దొర- సెలవు దొర.
28. ఎనిమిదేండ్లళ్ల ఏం మారింది?
తెలంగాణ పొలాలకు నీళ్లు రాలే.
తెలంగాణ పొరగాళ్ల నియమకాలు కాలే.
తెలంగాణ నిధులన్ని అప్పులకే సరిపోతుండే.
సాలు దొర- సెలవు దొర.
29. ఎన్నికలొస్తే జూఠా మాటలు,
ఎన్నికైనంక మాయ మాటలు.
ఇగ సాగవు సారు, నీ ఆటలు.
సాలు దొర- సెలవు దొర.
30. పట్టపగలే రోడ్లపైన హత్యలు
పట్టపగలే మొగ్గలపై అత్యాచారాలు
పట్టని ప్రభుత్వం, పట్టించుకోని యంత్రాంగం.
సాలు దొర- సెలవు దొర.
31. ఎనిమిదేండ్ల గడీల యుగం,
తెలంగాణ మొత్తం ఆగమాగం.
నీళ్లు, నిధులు నియామకాలను బొందవెట్టిన
నీ బంగారు తెలంగాణ ఒక మోసం.1
- Tags
- bjp
- cm kcr
- PM Narendra Modi
- TRS
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!