Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది.
అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.
Social Media DP Change: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు సోషల్ మీడియా ఉపయోగించే పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్చర్ లేదా డిస్‌ప్లే పిక్చర్(డీపీ)గా త్రివర్ణ పతాకం ఉంచాలని ప్రధాని మోదీ ఇటీవల కోరారు. దీంతో చాలా మంది వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా పలు సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్‌గా మువ్వన్నెల జెండాను…
జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 'ఆజాదికా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో 'మోదీ@2.0' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 600 ఎకరాల్లో 423 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ను ప్రధాని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల కేంద్రంలో వర్చువల్గా ప్రారంభించారు.
PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విదంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు.
O Panneerselvam Joining BJP: తమిళనాడు రాజకీయాలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఇరు వర్గాలు పోటాపోటీగా కోర్టు కేసులు పెట్టుకున్నాయి.