RSS Changes Profile Pictures Of Social Media Accounts To National Flag: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ను మార్చడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ కాషాయ జెండానే తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా ఉంటుంది. అయితే తాజాగా కాషాయ జెండాను మార్చి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన…
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలోని తమ నివాసంలో చిన్నారులతో కలిసి రక్షా బంధన్ను జరుపుకున్నారు. ఈ చిన్నారులు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు, గుమస్తాలు, తోటమాలి, డ్రైవర్లు మొదలైన వారి కుమార్తెలు కావడంతో ఈ రక్షాబంధన్ ప్రత్యేకతను చోటుచేసుకుంది.
ఆగస్టు 5న నల్లబట్టలు ధరించి 'ధరల పెరుగుదల'పై కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు కాంగ్రెస్పై మండిపడ్డారు. కొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగి చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్లో గతంలో కొనుగోలు చేసిన భూమిని మోడీ విరాళంగా ఇచ్చేశారు.
PM Narendra Modi Comments in NITI Aayog Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020 మార్చి కరోనా లాక్ డౌన్ తర్వత తొలిసారిగా ముఖాముఖీ సమావేశం జరిగింది. అంతకు ముందు కేవలం వర్చువల్ సమావేశాలే జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వివర్శించే బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఆయన్ను కలిశారు మమతాబెనర్జీ. బెంగాల్ రాష్ట్రంలో సమస్యలను, జీఎస్టీ బకాయిల విడుదలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు మమతా బెనర్జీ. నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చిన…
Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది.