న్యూయార్క్ టైమ్స్‌లో ఢిల్లీ విద్యా విధానంపై ఆర్టికల్ రాశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ఇది తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని.. టీచర్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందన్నారు. నిన్న తన నివాసంతో పాటు సచివాలయం కార్యాలయంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారన్నారు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు.
PM Narendra Modi comments on Jal Jeevan Mission: దేశంలో ఆగస్టు నాటికి 10 కోట్ల ఇళ్లను ట్యాప్ వాటర్ కనెక్షన్లతో అనుసంధించామని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. స్వర్ణయుగానికి ఇంతకన్నా మంచి ప్రారంభం ఉండదని వ్యాఖ్యానించారు. ఇంటింటికి నీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఇది పెద్ద విజయం అని ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేవలం మూడేళ్లలోనే 7 కోట్ల కుటుంబాలు మంచినీటి సదుపాయాన్ని పొందాయని అన్నారు.
తాజాా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ముంబైలో భారత మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పుల్లీ ఎయిర్ కండిషన్డ్ బస్సును ఆవిష్కరించారు. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) కొత్తగా కొనుగోలు చేసిన ఈవీ డబుల్ డెక్కర్ బస్సును గడ్కరీ ఆవిష్కరించారు. దశల వారీగా మరికొన్ని బస్సులు 2023 నాటికి ముంబై మహానగరం రోడ్లపైకి రానున్నాయి. ‘‘సుస్థిరమైన విప్లవానికి నాంది.. ఈ రోజు ముంబైలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్…
Rahul Gandhi criticizes PM Narendra Modi: 2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతో పాటు మరో ఏడుగురిని చంపిన కేసులో నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, గుజరాత్ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించారు.
parliamentary party board, No place for Yogi, Nitin Gadkari: బీజేపీ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో బీజేపీలో అత్యన్నత నిర్ణయాధికార కమిటీ అయిన కేంద్ర పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా... ప్రధాని నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా, లోక్సభ మాజీ ఎంపీ…