దాయాది దేశం పాకిస్థాన్‌ను భీకర వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. దేశంలోని సగానికి పైగా భూభాగం వరదను ఎదుర్కొంటోందని ఓ పాక్ మంత్రి వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ "అర్ధరహితంగా" ఉందని ఆరోపించారు. జీ23 లెటర్ రాయడమే రాహుల్ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
shivsena's Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ…
Prime Minister Narendra Modi will inaugurate Atal Bridge: ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ ‘అటల్ బ్రిడ్జ్’ ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. సబర్మతి రివర్ డెవలప్మెంట్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌కు తూర్పు, పడమర వైపుల కలిపే అటల్ బ్రిడ్జిని నిర్మించారు. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. దాదాపుగా…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నంబర్ వన్‌గా నిలిచారు. భారత ప్రధాని మోడీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది.
కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని మోడీ కొనియాడారు. తిరుపతిలో రెండు రోజుల కార్మిక సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా ప్రారంభించారు.
ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని…