Chada Venkat Reddy: అధికారం కోసం తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chada Venkat Reddy Fires On PM Narendra Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు.. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలో ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదంతో దేశంలో బీజేపీ పాలన సాగిస్తోందని అన్నారు. విద్యాలయాలు కాషాయ నిలయాలు కావొద్దని.. విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యాలయాలు మత, కుల నిలయాలు కాకూడదని పోరాడుతోన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. విద్యుత్ సవరణ చట్టం వల్ల సబ్సిడీ ఉండదని, రైతులకు ఉచిత విద్యుత్ దక్కదని వెల్లడించారు. ఆదానీ, అంబానీలు ప్రధాని మోదీకి పెద్ద కొడుకు, చిన్న కొడుకు లాంటివారన్నారు. సహజ వనరులను, దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేదలు అల్లాడుతోంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం జీఎస్టీతో సామాన్యులపై భారం మోపిందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మోదీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందని.. ట్యాక్స్‌ల కారణంగా సామాన్య ప్రజల బ్రతుకులు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన చెందారు.
Also Read
సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు కూడా పెరిగిపోయాయని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే వారిని హతమారుస్తూ, రాజద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. పౌర హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని.. విద్యార్థులు చదువుతూనే, సామాజిక ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!