ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నై విమానాశ్రయంలో మొత్తం రూ.2,437 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంతో సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
Assam MLA: తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను వెంటనే కూల్చివేయాలని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మీ కోరారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి.
Ajit Pawar comments on Modi's degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్…
Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం…
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే…
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏప్రిల్ 9న 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' జరగనుంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో పర్యటించనున్న రోజున రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు.