Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతల రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ ఫిబ్రవరిలో తనతో వైట్హౌజులో సమావేశమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన.
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.
Modi-Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఇద్దరు నాయకులు భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి…
Prabowo Subianto : ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత సాయంత్రం ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
Republic Day: భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు.
Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు.