మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను విడుదల చేశారు. తనకు ఈ అవార్డును ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నటనా ప్రతిభను కనిపెట్టిన తన స్నేహితుడు, బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్‌కు, తనను నటుడిగా మార్చడానికి కష్టపడిన తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు రజినీ. అలాగే రజనీకాంత్ తన గురువు కె బాలచందర్, తన సినిమాలకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
Read also : “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
రజనీకాంత్ ఈరోజు అక్టోబర్ 24న చెన్నైలోని పోయెస్ గార్డెన్ హౌస్ దగ్గర మీడియాతో సమావేశమై ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడం గురించి మాట్లాడారు. తలైవా తానెప్పుడూ ఈ గౌరవనీయమైన అవార్డును గెలుచుకుంటానని ఊహించలేదని చెప్పారు. ఇలాంటి సమయంలో తన గురువు కె బాలచందర్ సజీవంగా లేరని, ఆయన లేకుండా అవార్డు అందుకోవడం బాధగా ఉందని అన్నారు.
ఏప్రిల్ 2021లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గత నాలుగు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసినట్లు ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రకటన చేయగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అవార్డు వేడుక ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ అవార్డు వేడుక రేపు (అక్టోబర్ 25) ఢిల్లీలో జరుగుతుంది. రజినీకాంత్ స్వయంగా ఈ వేడుకకు హాజరై అవార్డును అందుకుంటారు.
My heartfelt thanks to the government of india, respected & dearest @narendramodi ji, @PrakashJavdekar ji and the jury for conferring upon me the prestigious #DadasahebPhalkeAward I sincerely dedicate it to all those who have been a part of my journey. Thanks to the almighty 🙏🏻
— Rajinikanth (@rajinikanth) April 1, 2021
రజనీకాంత్ 1975లో దివంగత దర్శకుడు కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సౌత్ తో పాటు రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానున్న ‘అన్నాత్తే’లో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కానుంది.
🙏🏻🇮🇳 pic.twitter.com/vkTf6mxYUu
— Rajinikanth (@rajinikanth) October 24, 2021
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!