వచ్చే ఎన్నికల్లో పాటియాలా నుంచి అమరీందర్ పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని సింగ్ చెప్పారు. సిద్ధూకు భయపడి మేము పాటియాలా ను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరి వల్ల కూడా పాటియాలను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమన్నారు.
పాటియాలా సింగ్ కుటుంబానికి బలమైన కోటగా ఉంది (అతని తండ్రి పాటియాలా రాష్ట్రానికి చివరి మహారాజు). అతను నాలుగు సార్లు ఈ సీటును గెలుచుకున్నాడు. అతని భార్య ప్రణీత్ కౌర్ 2014 నుండి 2017 వరకు మూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతి నిధ్యం వహించారు. ఇటీవల, సింగ్ తన కొత్త రాజకీయ పార్టీ – ‘పంజా బ్ లోక్ కాంగ్రెస్’ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి లేఖ పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసిన వెంటనే అమరీందర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. అనంతరం అమ రీందర్ సింగ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్ని కల కోసం సరి కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తానని చెప్పారు. సీట్ల పంపకాల ప్రణాళిక కూడా 110శాతం రూపొందుతుందన్నారు. రైతు లు కూడా పోరాటానికి సహకరించాలని అమరీందర్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!