బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో వరదలు వచ్చాయి.
Also Read:Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు
బెంగళూరు మెట్రో వైట్‌ఫీల్డ్ లైన్‌లో కొత్తగా ప్రారంభించిన నల్లూర్‌హళ్లి స్టేషన్ మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్లాట్‌ఫారమ్‌పై టికెటింగ్ కౌంటర్ దగ్గర వరద నీరు చేరింది. ఈ మెట్రో స్టేషన్‌ను ప్రధాని మోడీ రెండు రోజుల క్రితమే ప్రారంభించారు. వరద నీటిలో మునిగిన మెట్రో స్టేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ట్విటర్ వినియోగదారులు నల్లూరుహళ్లి మెట్రో స్టేషన్‌ను వరదలు ముంచెత్తడంతో చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేశారు. అసంతృప్తులైన పలువురు ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో వ్యవస్థ వినియోగానికి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. పనులను సరిగ్గా పూర్తి చేయకుండానే హడావుడిగా మెట్రో స్టేషన్లు ప్రారంభించారని విమర్శలు గుప్పించారు.
Inside the brand new Nallurhalli Metro station.
Water on the platform as well near the ticketing counter. @cpronammametro one rain, and water has seeped inside fully. pic.twitter.com/HhJFt8aQkw
— Whitefield Rising (@WFRising) April 4, 2023
బెంగళూరు మెట్రోలో 13.71 కిలోమీటర్ల ఫేజ్ IIను రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు కొత్త మెట్రో లైన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ మెట్రో లైన్ రూ. 4,249 కోట్లతో నిర్మించబడింది. మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు హైవే కేవలం ఆరు రోజుల తర్వాత రాష్ట్రంలోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాల తర్వాత జలమయమైంది.
కాగా, మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో బెంగళూరులో విమాన సర్వీసులు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగర శివార్లలో వరదలు ముంచెత్తడంతో పద్నాలుగు విమానాలు దారి మళ్లించబడ్డాయి. అనేక విమానాలు ఆలస్యమయ్యాయి.
Inside the brand new Nallurhalli Metro station.
Water on the platform as well near the ticketing counter.
One light rain, and water has seeped inside fully. What will happen in rainy season?
Was incomplete metro innaugrated only for PM to get 2 mins of headlines? pic.twitter.com/T10qxWKnFN
— Kamran (@CitizenKamran) April 5, 2023