PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం…
Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
H-1B Visa: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. రక్షణ, సాంకేతిక విషయాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మోడీ పర్యటన వేళ.. అమెరికా భారతీయులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
BJP Door to Door: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది.