UPI At France: పారిస్‌లోనూ మన రూపాయి చెల్లుబాటు.. ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI At France: ఇతర దేశాలకు వెళితే మన రూపాయి చెల్లుబాటుకాకపోవడంతో.. మన కరెన్సీని అక్కడి స్థానిక కరెన్సీలోకి మార్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఫ్రాన్స్ కి వెళ్లిన వారు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపై పారిస్‌లో మన రూపాయి చెల్లుబాటు కానుంది. అలాగే ఫ్రాన్స్ లో మన యూపీఐ సేవలు కొనసాగనున్నాయి. దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులదే హవా. నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ సాంకేతికతపై ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీనికి నిదర్శనం గతేడాది ప్రపంచంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ తొలి స్థానంలో నిలవడం. సరికొత్త ఆవిష్కరణలు, దేశం నలుమూలలా వినియోగంతో భారత్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలను విదేశాలకు విస్తరించే పనిలో కేంద్రం నిమగ్నమై ఉంది. ఫ్రాన్స్‌లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లోని ప్రవాసీ భారతీయులతో గురువారం సమావేశమయ్యారు. భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’(UPI) సేవలు ఇక ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని మోడీ తెలిపారు. ‘ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.. త్వరలోనే ఈఫిల్ టవర్ (Eiffel Tower) వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి.. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు.
Read also: Viajy Devarakonda : ఆరాధ్య సాంగ్ నా మనసుకు ఎంతగానో నచ్చింది..
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ఫ్రాన్స్‌లో యూపీఐను అనుమతించడం వల్ల భారతీయులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గజిబిజిగా ఉన్న ఫారెక్స్ కార్డ్‌లు వినియోగం, నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు దేశంలో విశేషంగా ప్రాధాన్యం పొందాయి. యూఏఈ, భూటాన్, నేపాల్‌లో వంటి దేశాల్లోనూ యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. గతేడాది ఎన్పీసీఐ, ఫ్రాన్స్‌లు ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ లైరా అని పిలిచే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అలాగే ఈ ఏడాది యూపీఐ, సింగపూర్‌కి చెందిన PayNow మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల్లోని వినియోగదారులు దీని ద్వారా లావాదేవీలకు అనుమతించారు. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు