కేసీఆర్ తెలంగాణను రాజకీయాల కోసం వాడుకొని దగా చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి…
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజస్ యుద్ధ విమానంలో ఆయన ఓ ట్రిప్ వేశారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు.
Indrakaran Reddy: మా ఓట్లు కావాలి కానీ, మా నిర్మల్ అభివృద్ధి మీకు పట్టదా? ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకుని నిర్మల్ కు వస్తున్నారు? అని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు.