ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ దృశ్యాలను తన ట్యాబ్లో చూశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్టు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీహార్లోని పూర్ణయాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు.
దేశ ప్రజలకు ఒక్కటే గ్యారంటీ.. అది మోడీ గ్యారంటీ తప్ప వేరే ఏ గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లోని బ్రహ్మ లింగేశ్వర టీ పాయింట్ దగ్గర చాయ్ పే చర్చలో ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా ఐదు ర్యాలీలు నిర్వహించారు. మూడోసారి బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్లోని గయా చేరుకున్నారు.
PM Modi: సిక్కు, హిందువుల దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేశారు.
దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించాలని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్లో కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోతో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోడీ తెలిపారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు.