ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మరియు మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని" తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ పూరీ లోక్‌సభ అభ్యర్థి…
Amit Shah : తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు.
Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తొలి నాలుగు దశల్లోనే ప్రధాని మోడీ 270 సీట్లను అధిగమించారని,
PM Modi: తరగతి గదిలో ‘‘మోడీకి ఎవరూ ఓటు వేయద్దు’’ అని చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీకి ఎవరూ ఓటేయద్దని చెప్పడం వివాదాస్పదమైంది.
PM Modi: సోనియాగాంధీ టార్గెట్‌గా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్‌బరేలీని వదిలేసి, తన కొడుకు రాహుల్ గాంధీ కోసం సోనియాగాంధీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకపడ్డారు. బెంగాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఇద్దరు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా ఢిల్లీలో కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తానని అన్నారు. కేజ్రీవాల్ కాంగ్రెస్ బటన్‌ను నొక్కుతారు, నేను ఆప్ బటన్‌ను నొక్కుతాను… అని వయనాడ్ ఎంపీ దేశ రాజధానిలో ఇండియా బ్లాక్ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీలో ప్రసంగించారు. ర్యాలీలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని చాందిని…
భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
PM Modi: 2014 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు ఢిల్లీలోని ప్రధాన భాగాల్లో ఉన్న 123 ఆస్తులను అప్పగించడాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రస్తావించారు.