సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఆహ్వానం పలికారు. గురువారం జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సదస్సుపై తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని.. సదస్సులో భారత్ అత్యున్నత స్థాయిలో పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు గురువారం తెలిపారు.జూన్ 15-16 తేదీలలో స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంతర్జాతీయ శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. సమ్మిట్ కోసం స్విట్జర్లాండ్ 160 దేశాలకు ఆహ్వానాలు పంపింది.
ఇది కూాడా చదవండి: Birthday Cake: “బర్త్ డే కేక్” తీసుకురావడం ఆలస్యమైందని భార్య, కుమారుడిపై కత్తితో దాడి..
ఇదిలా ఉంటే తాజాగా వెలువడిన సార్వత్రకి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది.దీంతో మూడోసారి మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 6గంటలకు మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
ఇది కూాడా చదవండి: YSRCP: తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం మార్చాలని వైసీపీ నిర్ణయం