లోక్సభ ఎన్నికల వేళ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది.. దేశంలో అవకాశాలకు కొదవలేదని అన్నారు.
నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్పూర్, భదోహి, ప్రతాప్గఢ్లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. శ్యామ్ రంగీలా మిమిక్రీ ఆర్టిస్ట్.. అతను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా చాలా మంది నాయకులను అనుకరించేవాడు. దీంతో…
Pakistan: పాకిస్తాన్కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత చిన్నచిన్న ప్రతిపక్షాలు అన్నీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ దారిలో వెళ్లడం ప్రమాదకమని ఆయన ఈ రోజు ఓటర్లను హెచ్చరించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం యుద్ధం అంచున ఉన్న ఈ తరుణంలో భారత్కి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం అవసరమని బుధవారం అన్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఐదో విడత మే 20న జరగనుంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు.
వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
వారణాసి నుంచి లోక్సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.