ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గర్ యోజన పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తానూ.. నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైనా పరిస్థితులు, ఇబ్బందులపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్వి్ట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు.