దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైనా పరిస్థితులు, ఇబ్బందులపై ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్వి్ట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో డైరీలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Story Board: మావోయిస్టుల పేరు చెప్పి వందల ఫోన్లు ట్యాప్.. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పరువు తీసిందా?
దేశ చరిత్రలో 1975 నుంచి 1977 వరకు చీకటి రోజులుగా మోడీ అభివర్ణించారు. ఆనాటి పరిస్థితులపై మోడీ తొలి రాజకీయ జీవితంపై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘‘ది ఎమర్జెన్సీ డైరీస్-ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఎ లీడర్’’ పేరుతో కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించింది.
ఇది కూడా చదవండి: Betting Racket: పోలీసుల దెబ్బకు బెట్టింగ్ రాయుళ్ల ముఠాకు చెక్‌మేట్..!
ది ఎమర్జెన్సీ డైరీస్‌లో మోడీ వ్యక్తిగత జీవితం.. రాజకీయ ప్రస్థానం.. రాజకీయ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడంలో.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మోడీ పాత్ర ఏంటి? అన్న విషయాలు ఈ పుస్తకంలో పొందిపరిచారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయంలో ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మోడీ ఎలా ఎదుర్కొన్నారో.. వాటి గురించి వివరణాత్మకంగా పుస్తకంలో ఉన్నాయని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇక మోడీతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందిపరిచారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి ఇలా పుస్తకం ముద్రించడం మొదటి ప్రయత్నంగా పేర్కొంది.
‘The Emergency Diaries’ chronicles my journey during the Emergency years. It brought back many memories from that time.
I call upon all those who remember those dark days of the Emergency or those whose families suffered during that time to share their experiences on social…
— Narendra Modi (@narendramodi) June 25, 2025
BlueKraft is honoured to present a new book: The Emergency Diaries – Years that Forged a Leader.
The book delves into the compelling role that @narendramodi, then a young RSS Pracharak, played in the fight against Emergency.
Based on first person anecdotes from associates who… pic.twitter.com/rFeg2v6t7n
— BlueKraft Digital Foundation (@BlueKraft) June 25, 2025