తన డబ్బు తిరిగి అడిగినందుకు ఒక దళిత మహిళను సర్పంచ్ ప్రతినిధి కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. నివారీ జిల్లా పృథ్వీపూర్ జనపద్ పరిధిలోని మనేత గ్రామంలో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్‌కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో అతడిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అతడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం దీనికి…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న పంజాబ్ లోని అమ్రుత్సర్ విచ్చేసిన కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గురుదాస్ పూర్ జిల్లాలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శించారు.
Budget 2024 : దేశ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె చెప్పారు.
Barabanki incident: ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను…