Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Punjab Flood Relief Visit

Bandi Sanjay : వారందరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తాం

Published Date :October 18, 2025 , 4:29 pm
By Gogikar Sai Krishna
  • భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన
  • పంజాబ్‌లో వరద ముంపు ప్రాంతాల పరిశీలన
  • గురుదాస్ జిల్లాలో వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలను సందర్శించిన కేంద్ర మంత్రి
  • వరద దెబ్బకు పత్తాలేని సరిహద్దుల్లో పత్తా లేని పాకిస్తాన్ సైనిక సిబ్బంది
  • సరిహద్దు ముంపు బాధితులకు నిరంతరంగా అండగా ఉన్న బీఎస్ఎఫ్
Bandi Sanjay : వారందరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తాం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న పంజాబ్ లోని అమ్రుత్సర్ విచ్చేసిన కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గురుదాస్ పూర్ జిల్లాలోని భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శించారు. ఇటీవల వచ్చిన భారీ వరదల పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 23 జిల్లాలు వరద ప్రభావితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,097 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. 3,88,092 మంది ప్రజలు వరదలవల్ల నష్టపోయారు. 56 మంది మరణించారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇదులో దాదాపు 3 లక్షల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిన్నది. భారీగా ఆస్తి, పశు సంపద నష్టం సంభవించింది. 10 వేలకు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

మరోవైపు పంజాబ్ లో వరదలతో గురుదాస్ పూర్ జిల్లా అత్యధికంగా నష్టపోయింది. ఈ జిల్లాలో 329 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే 1.45 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 87 వేల 569 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురుదాస్ పూర్ జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా ఈ జిల్లా భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న 11 గ్రామాలను సందర్శించారు. డేరాబాబాద్ నానక్ ప్రాంతంలోని నంగ్లీ, ఘనియక్ బేట్, గురుచుక్, సమురాయ్, తపాలా, రన్ సేక్ తల్లాన్, డాబుర్జీ, ధర్, రహమద్ బాద్, మష్రాలా, నబీ నగర్, బరై గ్రామాలు ఇందులో ఉన్నాయి.

Also Read

  • Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
  • Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
Add as a preferred
source on google

తొలుత నంగ్లీ గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామం పూర్తిగాట బీఎస్ఎఫ్ అధికారుల పహారాలో ఉంది. వరదలవల్ల ఈ గ్రామ ప్రజల ఇండ్లల్లోకి దాదాపు 20 అడుగుల మేరకు నీళ్లు వచ్చాయని, బాధితులందరికీ సురక్షితంగా పునరావాసా కేంద్రాలకు తరలించి భోజన, వసతిసహా కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈ సదర్భంగా బీఎస్ఎఫ్ అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వివరించారు. వారితో కలిసి దేశ సరిహద్దు ఫెన్సింగ్ వరకు వెళ్లారు. ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. బైనాక్యులర్స్ ద్వారా వరద ముంపు ద్రుశ్యాలను వీక్షించారు. ఫెన్సింగ్ అవతలి వైపు పాకిస్తాన్ సైనికులు ఎవరూ కన్పించకపోవడంతో ఇదే విషయాన్ని బీఎస్ఎఫ్ సిబ్బందిని అడిగారు. వరదలు రావడంతో సరిహద్దుకు ఆవతల గస్తీ కాస్తున్న పాకిస్తాన్ సైనికులు పత్తా లేకుండా పోయారని తెలిపారు. వెంటనే కేంద్ర మంత్రి స్పందిస్తూ వానలు, వరదలను లెక్క చేయకుండా నిరంతరం గస్తీ కాయడమే కాకుండా బాధితులను రక్షిస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. వారితో కలిసి సెల్ఫీ దిగారు.

అనంతరం నంగ్లీ గ్రామ రైతులను కలిశారు. వారి బాధలను విన్నారు. అక్కడి నుండి నేరుగా గురుచుక్ వెళ్లారు. రావి నది వరదలతో ఆ గ్రామంలోని పంటలన్నీ పూర్తిగా ధ్వంసమవడమే కాకుండా కిలోమీటర్ల మేరకు ఆ భూముల్లో మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పోయిన ద్రుశ్యాలను చూశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారు పడుతున్న బాధలను, జరిగిన నష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారా? లేదా? అని అడిగితే ’’ఒక్క మంత్రి, అధికారి కానీ ఇంతవరకు తమ గ్రామంలోకి అడుగు పెట్టలేదని స్థానిక రైతులు వాపోయారు. ఈ గ్రామంలో పర్యటిస్తున్న తొలి మంత్రి మీరేనని, కేంద్రమే ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. రెండేళ్లపాటు పంటలు సాగు చేసుకోవడానికి కూడా భూములు పనికిరావని, అన్ని విధాలా సాయం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి పర్యటించిన ఇతర గ్రామాల్లోనూ ప్రజలంతా దాదాపు ఇదే బాధను వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా గురుచుర్, సమురయ్, ఘనియక్ బేట్, రన్ సేక్ తల్లాన్ గ్రామాల ప్రజలతో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆయా గ్రామాల్లోని వరద బాధితులకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, మసాలా దినసులతో కూడిన ‘మోడీ కిట్ల’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా అందజేశారు. అనంతరం ఆయా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వరద ముంపు బాధితులు తీవ్రమైన కష్టాల్లో ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలతోనే పంజాబ్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. నష్టపోయిన పంజాబ్ రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల తక్షణ సాయం విడుదల చేసినట్లు తెలిపారు.

ఇవిగాకుండా రూ.1200 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు సైతం రాష్ట్రం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు. వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్థి, పంట, ఇతరత్రా నష్టాలపైనా పూర్తి నివేదిక వచ్చాక ప్రజలకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరాశ్రయులకు తక్షణ సాయంగా బియ్యం, పప్పు, ఉప్ప, మసాల దినుసులతో కూడిన ‘మోడీ కిట్స్’ ను అందిస్తున్నట్లు తెలిపారు. వరదలవల్ల పంజాబ్ కు ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాకు జరిగిన నష్టాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నివేదించబోతున్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం బాధాకరమన్నారు. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు ఆధైర్యపడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. మోడీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మోడీ ఆదేశాల మేరకు ఆ భరోసా ఇచ్చేందుకే తాను పంజాబ్ కు విచ్చేసినట్లు వివరించారు. మరోవైపు పంజాబ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన సాయంత్రం పొద్దుపోయే వరకు కొనసాగనుంది.

Gold Price: విజయవాడలో కనిపించని ధన త్రయోదశి ఎఫెక్ట్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • BSF
  • india-pakistan border
  • PM Awas Yojana
  • Punjab Floods

తాజావార్తలు

  • TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్..

  • Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల

  • Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు

  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!

  • kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions