టెస్ట్ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అంటే 333 మంది ఆటగాళ్లను వేలంలో వేలం వేయనున్నారు. మిచెల్ స్టార్క్ 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వేలంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈసారి జరిగే వేలంపాటలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు డిమాండ్ పలుకనున్నారు.
Funny : భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు క్రికెట్ ప్రేమికుల సంఖ్య భారీగా ఉంటుంది. క్రికెట్ పోటీలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి.