Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
Congress: ప్రార్థనా స్థలాలా చట్టం-1991ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత నెలలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించిందవి. అయితే, ప్రార్థనా స్థలాల కేసులో కాంగ్రెస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆ పార్టీ కోరింది.
Places of Worship Act: భారతదేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (జనవరి2) విచారణ జరపనుంది.
Supreme Court: ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఈ పిటిషన్ పరిష్కరించే వరకు కొత్తగా ఎలాంటి పిటిషన్లు స్వీకరించొద్దని సూచించింది. మందిర్-మసీద్ వివాదాల్లో ఎలాంటి సర్వేలను అనుమతించమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు మతపరమైన స్వభావాన్ని నిర్ణయించేందుకు ఎలాంటి ఆదేశాలు, సర్వేలు జారీ చేయవద్దని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.